ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 250కోట్ల కుంభకోణం: టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రణవ్ గోపాల్ - TNSF Pranav Gopal Complaint - TNSF PRANAV GOPAL COMPLAINT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 10:56 AM IST
TNSF State President Pranav Gopal Complaint Against YCP Goverment : గ్రూప్-1 పరీక్షల్లో కుంభ కోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మూడో పట్టణ సీఐకి టీఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిల పేర్లును ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018లో నిర్వహించిన గ్రూప్ 1లో రూ.250 కోట్లు కుంభకోణం జరిగిందని ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.
Visakha District : జగన్హయాంలో ఏపీపీఎస్సీని వైఎస్సార్పీఎస్సీగా మార్చుకున్నారని ప్రణవ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగ యువత గుండె కోతను మిగిల్చారని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వ్యాఖ్యానించారు. 2018లో నిర్వహించిన గ్రూప్ 1కు సంబంధించి జరిగిన కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.