ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుపతమ్మ తిరునాళ్లు ప్రారంభం - భక్తులకు ఏర్పాట్లు - నుగంచిప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 1:58 PM IST

Tirupatamma Tirunalu in NTR District : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లు ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తిరునాళ్ల ఐదు రోజులపాటు వైభవంగా జరగనున్నాయి. ఆలయ ఛైర్మన్ శ్రీనివాసరావు, ఈవో (EO) రమేష్ నాయుడు అమ్మవారి అఖండ జ్యోతి వెలిగించి ఉత్సవాలు వేడుకలు ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన మాలధారులు అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు. ఈ రోజు రాత్రి తిరుపతమ్మ, గోపయ్యస్వాముల కళ్యాణం చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Sri Lakshmi Tirupatamma Temple Penuganchiprolu : భక్తుల అవసరాలకు పలు రకాల సౌకర్యాలను దేవస్థానం కల్పించింది. మునేరులో జలస్థానాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. దీక్షలు విరమించిన భక్తులకు దేవస్థానం మామిడి తోటలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం రాత్రికి జరిగే తిరుపతమ్మ, గోపయ్య స్వాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి ఇతర సౌకర్యాలపై రాజీ లేకుండా ఏర్పాటు చేస్తున్నామని ఈవో రమేష్ నాయుడు తెలిపారు. లక్షన్నర లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details