LIVE: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు - సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM LIVE
Published : Oct 7, 2024, 6:58 PM IST
|Updated : Oct 7, 2024, 9:32 PM IST
Tirumala Srivari Brahmotsavam Sarva Bhupala Vahanam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో తిరుమాడ విధులలో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహన విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. 'రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే' అని వేదాలలో వర్ణించినట్లుగా శ్రీహరి రాజాధి రాజు. సర్వ భూపాలుడు వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కందాలపై మోస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే.
Last Updated : Oct 7, 2024, 9:32 PM IST