తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం కార్యక్రమంలో స్టాఫ్​ నర్సుల ఆందోళన - రెగ్యులర్​ చేయాలని డిమాండ్ - Staff Nurse Protest For Regularize

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 5:26 PM IST

Tims Hospital Staff Nurse Protest at LB Stadium : హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదుట గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళ చేశారు. తమకు 20 శాతం వెయిటేజ్ మార్కులు ఇచ్చి, రెగ్యులర్ చేయాలని ప్లకార్డులతో నర్సులు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలోని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి 6956 స్టాఫ్ నర్సులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేస్తుండగా, కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు(Contract Staff Nurse) ఆందోళన చేపట్టారు.

Staff Nurse Protest For Regularize at LB Stadium : స్టాఫ్​ నర్సులు స్టేడియం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో నర్సులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి, నాంపల్లి పోలీసు స్టేషన్​కు తరలించారు. ఈ నేపథ్యంలో నర్సులకు పోలీసులకు తోపులాట జరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కాసేపు ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

ABOUT THE AUTHOR

...view details