తెలంగాణ

telangana

ETV Bharat / videos

పులి రాజసం ఎప్పుడైనా చూశారా? - tigr twitter viral videos

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 3:12 PM IST

Tiger Viral Videos : మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వు గురించి అందరికి తెలిసిన విషయమే. పులలను చూడటానికి ఇక్కడకు వివిధ ప్రాంతాల పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా దీనిని సందర్శించడంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ముందుంటారు. వారికి కెమెరాకు చిక్కినవే ఈ వీడియోలు. గంభీరమైన పులి ప్రపంచాన్ని మరచి తన విందులో మునిగిపోయింది. ఒక్కటే చక్కగ ఆహారాన్ని ఆస్వాదిస్తోంది. చెరువులో రిఫ్రెష్​గా స్నానం చేసింది. అలా నీటిలో కాసేపు సేద తీరింది. 

ప్రతిఒక్కరు పులి అంటే భయం కానీ అది ఏం చేస్తుందా అని చూసే అవకాశం వచ్చినప్పుడు ఎవ్వరు వెనుకాడరు కారణం దానికి ఉన్న రాజసం అటువంటిది. చూడటానికి అది గాండ్రించినా చాలు అనుకుంటారు కొందరు పర్యాటకులు. పులి ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడైనా కనిపిస్తే తన ఫోన్లో క్లిక్​ మనిపిస్తారు. ముఖ్యంగా పిల్లలు వీటి వీడియోలు బాగా చూస్తుంటారు. ప్రస్తుతం  ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్​ అవుతున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details