ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో చిక్కుకున్న విద్యార్థులు - అరగంట పాటు శ్రమించి కాపాడిన ఫైర్ సిబ్బంది - Students Stuck in Skywalk Lift - STUDENTS STUCK IN SKYWALK LIFT
Published : Aug 6, 2024, 7:43 PM IST
Students Stuck in Uppal Skywalk Lift : హైదరాబాద్‌లో రోజురోజుకు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్కైవాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేకమైన స్కైవాక్ ఏర్పాటు చేసింది. కానీ దీని నిర్వహణ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హబ్సిగూడకు చెందిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం ఉప్పల్‌కు వచ్చారు. రామంతాపూర్ వైపు వెళ్లేందుకు స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు. ఈ క్రమంలో అందులో చిక్కుకున్నారు. చాలా సేపు వరకు ప్రయత్నించినా లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో 100 నంబరు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఉప్పల్ పోలీసులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సుమారు అరగంట పాటు శ్రమించి విద్యార్థులను క్షేమంగా బయటకు తీశారు.