తెలంగాణ

telangana

జలపాతాన్ని తలపిస్తున్న ఫణిగిరి కొండ ప్రాంతం - వైరల్ వీడియో - Water Falls In Suryapet

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:18 PM IST

Water Falls In Suryapet (ETV Bharat)

Water Falls In Suryapet : చుట్టూ పచ్చదనం, కొండలు, చిన్నపాటి ముసురు, ప్రశాంతమైన వాతావరణం అక్కడో చిన్న ఆలయం ఇలా చెప్తుంటే ఏదో పర్యటక ప్రాంతం గురించి చెప్తున్నట్లు ఉంది కదూ. అవునండోయ్, జలపాతాన్ని తలపిస్తున్న ఈ కొండ ప్రాంతం సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఉంది. 

సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై నుంచి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలోకి వర్షం నీరు చేరింది. అలా కొండపై నుంచి నీరు నేరుగా ఆలయంలోకి చేరుతున్నది చూడడానికి కనుల విందుగా ఉంది. గుట్టపై ఉన్న బండ రాళ్లలపై నుంచి జాలు వారుతున్న వాననీరు జలపాతాన్ని తలపిస్తోంది. ఆ సుందర దృశ్యాలు, జల సవ్వళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చుట్టుపక్కల పచ్చదనం, అలా కొండపై నుంచి నీరు పడడం. పక్కన ఆలయం ఇలా అదొక పర్యాటక ప్రాంతంగా మారింది. ఒకవైపు చిన్నపాటి వర్షం కురుస్తూ అలా కొండపై నుంచి జాలువారుతున్న నీటిని చూస్తుంటే అందరూ అదో జలపాతం అనుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details