హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం - హెలికాప్టర్‌లో నుంచి వీక్షించిన మంత్రి పొన్నం, అధికారులు - Ganesh Immersion 2024 - GANESH IMMERSION 2024
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 7:34 PM IST
Minister Ponnam Watched the Ganesh Immersion Program From Helicopter : హైదరాబాద్ నిమజ్జనాన్ని హెలికాప్టర్‌లో నుంచి వీక్షించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయనతో పాటు డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాళి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ అధికారులు నిమజ్జనానికి ఎలాంటి అటంకాలు కలగకుండా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుకున్న విధంగానే మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణేశ్, సాయంత్రానికి బాలాపూర్ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. కాగా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వినాయకుడి నిమజ్జనానికి తీసుకువస్తారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈసారి నిమజ్జనాన్ని వీక్షించేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. సోమవారం నుంచి పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనం సాగుతున్నాయి. కాగా ప్రభుత్వం నిమజ్జనానికి ట్యాంక్‌బండ్ చుట్టూ 360 క్రేన్‌లను ఏర్పాటు చేసింది.