ఘనంగా దీపావళి వేడుకలు - ఆటపాటలతో సందడిగా వెలుగుల పండుగ
Published : Nov 4, 2024, 5:15 PM IST
|Updated : Nov 4, 2024, 6:11 PM IST
Diwali Celebrations in Belgium : మాతృభూమికి దూరంగా ఉన్నా మన తెలుగువారి మనసంతా ఇక్కడే ఉంటుంది. మన పండుగలు, వేడుకలు, సంప్రదాయాలను వేరే దేశం వెళ్లినా మర్చిపోలేరు. భారతీయులంతా సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగ సంబరాలను ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. ఇలాగే బెల్జియంలోనూ మన తెలుగువారు వెలుగుల పండుగ దీపావళిని అంతా ఒక్కటై వైభవంగా నిర్వహించుకున్నారు.
బెల్జియంలోని తెలుగువారంతా ఇందుకోసం ఏకమయ్యారు. లింబర్గ్ ఫ్రావిన్స్లోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల కోసం అంతా తరలివచ్చారు. ఈ సందడిలో స్థానిక బెల్జియం వాసులు పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీదేవి పూజ నిర్వహించారు. అనంతరం ఆట, పాటలతో రోజంతా సందడిగా గడిపారు. చిన్నారులు, మహిళలు తమ టాలెంట్ ప్రదర్శించారు. చివర్లో అందరు ఉత్సాహంగా క్రాకర్స్ పేల్చి వెలుగుల పండుగను సందడిగా ముగించారు. అందరం కలిసి జరుపుకుంటేనే పండుగ ఆనందం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తమ తెలుగు పండుగలన్ని ఇలా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో సంక్రాంతి వేడుకలను మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.