తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశం : వాతావరణశాఖ - Telangana Weather Report Today - TELANGANA WEATHER REPORT TODAY

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 7:30 PM IST

Telangana Weather Report Today : వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో పొడి గాలులు వీస్తాయని దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశమున్నట్లు భారత వాతవరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. మే నెల 18వ తేదీకి ఎండల తీవ్రత కాస్త తగ్గి ద్రోణి ప్రభావం వల్ల వడగండ్లు కురుస్తాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం వేడి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందని, జూన్ 8 నుంచి 10 మధ్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అప్పుడు వేడి కాస్త తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.  

ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. శనివారం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30కి.మీ-40కి.మీ వేగంతో ప్రవహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాబోవు మూడు రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి మరిన్ని వివరాలు వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి ఈటీవీ భారత్​తో తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details