LIVE : అసెంబ్లీ పాయింట్ మీడియా వద్ద మాట్లాడుతున్న హరీశ్‌రావు - ప్రత్యక్షప్రసారం - Telangana Legislative meetings live
Published : Feb 13, 2024, 10:51 AM IST
Harishrao assembly point media conference Live : అసెంబ్లీ పాయింట్ మీడియా వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. అంతకుముందు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇవాళ ప్రజాప్రతినిధులు మేడిగడ్డ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరూ కలిసి బస్సులలో మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వద్దకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు చేరుకున్నారు. అనంతరం 10.15కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మేడిగడ్డకు బస్సుల్లో బయల్దేరారు.
మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకుంటారు. అనంతరం 2 గంటల పాటు సైట్ విజిట్ చేస్తారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అది ముగిసిన తరవాత 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు సందర్శన ఉన్నందున మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సర్వం సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.