తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - Telangana Legislative Council LIVE - TELANGANA LEGISLATIVE COUNCIL LIVE

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 12:13 PM IST

Updated : Aug 2, 2024, 3:39 PM IST

Telangana Legislative Council Meetings 2024 -25 Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై చర్చ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన విషయం తెలిసిందే. వెనుకబడిన, నిమ్నకులాల ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పాలసీలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత సభలో ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్​ అంశాలపై సభలో చర్చించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకు ముందు మంత్రి మండలి బడ్జెట్​కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్​ను రూపొందించారు. బడ్జెట్​లో వ్యవసాయ రంగం, సంక్షేమం, నీటిపారుదల, విద్యుత్​రంగం అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు.
Last Updated : Aug 2, 2024, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details