LIVE : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం - TELANGANA CEO VIKAS RAJ LIVE - TELANGANA CEO VIKAS RAJ LIVE
Published : May 1, 2024, 12:37 PM IST
|Updated : May 1, 2024, 1:17 PM IST
CEO Vikas Raj Live : లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవేచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించిందని వివరించారు. మిగిలిన ఐదింటి విషయంలో స్పష్టత రాలేదని చెప్పారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తి కానుందన్న ఆయన ఆ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయని వాటిని ఎన్నికల సంఘానికి పంపినట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికాస్‌రాజ్ పాల్గొన్నారు.
Last Updated : May 1, 2024, 1:17 PM IST