LIVE : బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియా సమావేశం - Kishan Reddy Press Meet - KISHAN REDDY PRESS MEET
Published : May 8, 2024, 5:17 PM IST
|Updated : May 8, 2024, 5:47 PM IST
Kishan Reddy Press Meet in Hyderabad : తెలంగాణలో ఈసారి ఎలాగైనా రెండంకెల సీట్లను సాధించాలని భారతీయ జనతా పార్టీ సంకల్పంతో ఉంది. అందుకు తగ్గట్లుగానే కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం సైతం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో కాషాయ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకా తదితర ముఖ్యనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన అక్రమాలను ప్రశ్నిస్తూ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై ధ్వజమెత్తుతున్నారు. అలాగే పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో, ఎన్ని నిధులు మంజూరు చేసిందో వంటి విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Last Updated : May 8, 2024, 5:47 PM IST