LIVE : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చ - ప్రత్యక్షప్రసారం
Published : Feb 9, 2024, 10:03 AM IST
|Updated : Feb 9, 2024, 6:36 PM IST
Telangana Assembly Sessions 2024 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభ, మండలిలో చర్చ జరగుతోంది. ఉభయసభలు సమావేశమైన అనంతరం చర్చను మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదిస్తున్నారు. మరో సభ్యుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆ ప్రతిపాదనను బలపరుస్తున్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CMRevanth Reddy) చర్చకు సమాధానం ఇస్తున్నారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం అసెంబ్లీలో పెటారు. ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను శనివారం ప్రవేశ పెట్టనున్నారు. కేబినెట్లో పద్దుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ప్రస్తుతం ధన్యావాద తీర్మానంపై నాయకులు చర్చ జరుపుతున్నారు.