'హింసను ప్రేరేపిస్తూ, నేరస్థులను దన్నుగా వైఎస్సార్సీపీ నాయకులు'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 11:47 AM IST
TDP Letter To Governer on YSRCP Govt : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయంటూ తెలుగుదేశం నేతలు (TDP Leders) గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైఎస్సార్సీపీ నాయకులు దన్ను కాస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను (Red sandalwood) ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని మాఫియాను (Mafia) ప్రేరేపింస్తోందని మండిపడ్డారు.
YSRCP Support to Illegal Scam In State : స్మగ్లర్లను అడ్డుకున్న అన్నమయ్య జిల్లా చిన్నపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గణేష్‌ను కారుతో గుద్ది చంపారని గుర్తుచేశారు. ఎర్ర చందనం స్మగ్లరైన విజయనంద రెడ్డిని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా నియమించటమే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో (Assembly Elections) చిత్తూరు నుంచి బరిలోకి దింపేందుకు అధికార పార్టీ ఆలోచిస్తుందని గవర్నర్‌కు తెలిపారు.