రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించిన ఏకైక పార్టీ తెలుగుదేశం: టీడీపీ నేతలు - TDP Ra Kadili Ra meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 6:57 PM IST
TDP Leaders Inspected Chandrababu Meeting Arrangements: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదిలిరా' సభ నిర్వహించనున్న నేపథ్యంలో హెలీప్యాడ్, సభ వేదికను, బస ఏర్పాట్ల పనులను టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సూచించారు. ఇప్పటికే ఉరవకొండకు ప్రత్యేక బలగాలు చేరుకున్నాయి. సభా వేదిక, హెలిప్యాడ్, చంద్రబాబు బస చేసే ప్రాంతాలను ఎన్ఎస్జీ బలగాలు సాయంత్రం తనిఖీ చేశాయి.
ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ శనివారం సాయంత్రం ఉరవకొండలో రా కదిలిరా కార్యక్రమ సభలో చంద్రబాబు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ వారీగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ కనీవిని ఎరగని రీతిలో ఉండబోతుందని అన్నారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించిన ఏకైక పార్టీ టీడీపీ అని కేశవ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభకు లక్షలాదిమంది ప్రజలు తరలి వస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ రకాంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.