ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మైదుకూరులో సుధాకర్​ యాదవ్​ ఎన్నికల ప్రచారం- టీడీపీలో చేరిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు - Sudhakar Yadav Election Campaign - SUDHAKAR YADAV ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 2:06 PM IST

TDP Leader sudhakar Yadav Election Campaign in Mydukur: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో తెలుగుదేశంలో చేరుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం (sudhakar Yadav Election Campaign) నిర్వహించారు. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం దగ్గరపడిందని సుధాకర్ యాదవ్ అన్నారు. 

వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం లెక్కలవారిపల్లెలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలో మనేరాంపల్లె గ్రామంలో ఉన్న పలువురు వైఎస్సార్సీపీ నేతలు సుధాకర్​ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. సుధాకర్​ పసుపు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వనించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details