ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

57 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల భూములను జగన్‌ కబ్జా చేసారు: సోమిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 3:48 PM IST

TDP Leader Somireddy Allegations on CM Jagan: గృహ నిర్మాణంపై ఒంగోలులోనూ జగన్​రెడ్డి అవే అబద్ధాలు చెప్పారని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు 2 సెంట్ల స్థలం ఇంటి పట్టా ఇస్తే జగన్‌ రెడ్డి సెంటుకు కుదించారని మండిపడ్డారు. గృహ నిర్మాణానికి కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధుల నుంచి చంద్రబాబు లక్ష ఇస్తే, జగన్ రెడ్డి కేంద్ర నిధులతోనే సరిపెట్టారని విమర్శించారు. 

57 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములు జగన్‌ రెడ్డి కబ్జా చేసారని ఆరోపించారు. దళితుల కోసం చంద్రబాబు భూమి కొనుగోలు పథకం పెట్టి 5 వేల ఎకరాలు ఇస్తే, జగన్‌ ఈ పథకాన్ని రద్దు చేశారని ధ్వజమెత్తారు. సెంటు పట్టా పేరుతో జగన్ 7 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు 2.60 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ప్రతి పేదవారికి 2 సెంట్ల ఇంటి పట్టా ఇస్తారని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details