ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE తిరుపతి నుంచి రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం. - Raghu Rama krishna live - RAGHU RAMA KRISHNA LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 5:24 PM IST

Updated : May 16, 2024, 5:48 PM IST

TDP Leader Raghu Rama krishna live: తిరుపతిలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన పులివర్తి నానిని నరసాపురం ఎంపీ, టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పరామర్శించారు. పులివర్తి నానిని ఆయన ఇంట్లో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. నానిపై జరిగిన దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని పోలింగ్‌కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక కనిపించదు. గతంలో పుట్టినరోజు నాడే నన్ను ఇబ్బందులకు గురిచేశారు. హతమార్చాలని చూశారు. జైలులో నేను చేసిన శపథం నెరవేరింది. గత ఎన్నికల్లో వైకాపాకు వచ్చిన సీట్లు 151. ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్న ఒకటి పోతుందో తెలియదు. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు ఓటేసేందుకు తరలివచ్చారు. తెదేపా నేత రఘురామకృష్ణరాజు మీడియాతో సమావేశం ప్రత్యక్షప్రసారం. 
Last Updated : May 16, 2024, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details