గ్రూప్-1లో అక్రమాలు రుజువైనా బుకాయిస్తున్నారు- సవాంగ్ రాజీనామా చేయాలి: పట్టాభి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 4:29 PM IST
TDP Leader Pattabhi on Group 1 Issue: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయిస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (TDP Spokesperson Kommareddy Pattabhiram) ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఏం జరగలేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ (APPSC Chairman Gautam Sawang) ప్రకటనలు ఇవ్వడం దారుణమని అన్నారు.
అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందని తెలిపారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా అని నిలదీశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగే అర్హత సవాంగ్‌కి లేదని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న గౌతమ్ సవాంగ్ తక్షణమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తొలగించముందే సవాంగ్ రాజీనామా చేస్తే గౌరవ ప్రదంగా ఉంటుందని పట్టాభిరాం హితవుపలికారు.