LIVE: టీడీపీ నేత విజయ్ కుమార్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - TDP Leader Vijay Kumar on TTD - TDP LEADER VIJAY KUMAR ON TTD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 26, 2024, 12:12 PM IST
|Updated : Mar 26, 2024, 12:34 PM IST
TDP Leader Neelayapalem Vijay Kumar Media Conference: టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిలను పక్కన పెట్టి తిరుమల పవిత్రతను కాపాడాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ నెల 12న సీఎం జగన్ లేఖ రాశారు. ఇప్పటికే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్ గడువూ ఈ ఏడాది మే 14తో ముగుస్తోంది. ఈ సంవత్సరం జూన్ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14వ తేదీన కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాలి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి నాలుగురోజుల ముందు జగన్ ఈ లేఖ రాశారు. ధర్మారెడ్డిని జూన్ నెలాఖరు వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాల్సిందిగా కోరారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా టీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిల తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 26, 2024, 12:34 PM IST