ఓటమి భయంతోనే సజ్జల అవాకులు- కంటైనర్‌లో ఏం లోడ్ చేశారనేది తేలాల్సిందే: టీడీపీ నేత షరీఫ్ - TDP Leader MA Sharif Press Meet
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 8:24 PM IST
TDP Leader MA Sharif fire on YCP Government : ఓటమి భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ ధ్వజమెత్తారు. సీఎం క్యాంపు ఆఫీసులోకి కంటైనర్ ఎందుకు వెళ్లిందని దానికి సూటిగా సమాధానం చెప్పలేని దుస్థితికి వైసీపీ వెళ్లిందని ఆయన అన్నారు. కంటైనర్‌లో ఏం లోడు చేశారనేది తేలాల్సిన అంశమేనని ఆయన పేర్కొన్నారు. సజ్జల చెబుతున్నట్టు పాంట్రీ కంటైనర్ అయితే అంత రహస్యంగా లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు. సీఎం ఇంటిలోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ని ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీశారు. అందులో గంటసేపు ఏమి లోడింగ్ చేశారో చెప్పాలని కోరారు.
కంటైనర్‌లో ఒకసారి పాంట్రీ సామాగ్రి అని, మరోసారి సిద్ధం సభలకు వచ్చిన ఆర్టీసీ బస్సులకు డబ్బుచెల్లించేందుకు కంటైనర్‌ను ఉపయోగించామని చెబుతున్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరితో తప్పుడు సమాచారం చెబుతున్నా విషయాల్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయం కాబట్టి ఎటువంటి వాహానం లోపలకి వెళ్లిన మెుదటి చెక్ పోస్టు వద్ద దాని వివరాలను నమోదు చేయాలి. కానీ అక్కడ అలాంటిదేది జరగలేదని తెలిపారు. రెండో చెక్ పోస్టు వద్ద వాహానాలను తనిఖీ చేసే స్కానర్ ఉంటుంది. కంటైనర్ అందులో స్కార్ కాకుండా వెనుక భాగం నుంచి వెళ్లనిచ్చారు. అసలు ఎందుకు కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లింది. వెళ్తే దాని వివరాలు ఎందుకు నమోదు చేయ్యాలేదని ప్రశ్నించారు. దీనిపై ఈసీ విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.