Stop And Wash Go To Prevent Accidents In YSR District: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది శాశ్వత వైకల్యంతో గడపాల్సి వస్తోంది. వాహనాలను నడిపే వారు వేగాన్ని అదుపు చేయలేక, సూచికల బోర్డులను పాటించక, మద్యం తాగి వాహనాలు నడపడం, వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు వైఎస్సార్ జిల్లాలో పోలీస్ అధికారి అశోక్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రమాదాల నివారణకు స్టాప్ అండ్ గో: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వైఎస్సార్ జిల్లాలో పోలీస్ అధికారి అశోక్ కుమార్ అధ్యక్షతన స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలన్నీ తెల్లవారుజామున 3 నుంచి 5 లోపల జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని జాతీయ రహదారులపై పోలీసులు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు వెళ్లే వాహనాలన్నింటినీ ఆపివేస్తారు. ఆ సమయంలో వారిని ముఖము కడుక్కోమని చెప్పి మొహం కడుక్కున్న తర్వాత వారందరిని తిరిగి పంపిస్తున్నారు.
వాహనాలన్నింటినీ ఆపి స్టాప్ అండ్ వాష్ గో: ఈ విధంగా ద్విచక్ర వాహనం మొదలుకుని పెద్ద వాహనాల వరకు అన్నింటినీ ఆపి స్టాప్ అండ్ వాష్ గో కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ప్రతి ఒక్కరు రెప్పపాటులో కునుకు తీయడం సహజము. ఈ క్షణకాలంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువల్ల తెల్లవారుజామున డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.
రూట్ మార్చిన పోలీసులు - పెద్దలు హెల్మెట్ పెట్టుకోవడం లేదని పిల్లలకు క్లాస్!
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!