ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గంటా రాజీనామా విషయంలో మూడేళ్లు గాడిదలు కాశారా? - స్పీకర్, సీఎం జగన్​పై బుచ్చయ్య చౌదరి ఆగ్రహం - వైఎస్సార్సీపీపై బుచ్చయ్య చౌదరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 1:24 PM IST

TDP Leader Buchayya Chowdary Fire on YSRCP: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే తమని అడుగుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని అన్నారు. గంటా రాజీనామా విషయంలో మూడేళ్ల పాటు స్పీకర్, సీఎం గాడిదలు కాశారా? అంటూ మండిపడ్డ ఆయన సీఎం జగన్​లో ఓటమి భయం ఉన్నందునే రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేయించారని విమర్శించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం నేతలు పరిటాల రవికి నివాళులర్పించారు. రాష్ట్రం బాగుండాలని తెలుగుదేశం పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో దోపిడీ చేసిన జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని నిలదీశారు. జగన్ హత్యా రాజకీయాల వల్ల పరిటాల రవి మృతిచెందారని అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం జగన్​కు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. కోడికత్తి శీనును జైలు నుంచి రానివ్వడం లేదన్న ఆయన సీఎం జగన్ బాబాయిని హత్య చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details