ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాయి ఘటన విఫలం - వైఎస్ కుటుంబంలో కొందరికి ప్రాణహాని !: ఆనం వెంకట రమణారెడ్డి - TDP Leader Anam on CM Jagan Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 12:54 PM IST

TDP Anam Venkata Ramana Reddy on CM Jagan Attack Incident: తాడేపల్లి డైరెక్షన్‌లోనే విజయవాడలో సీఎం జగన్‌పై దాడి జరిగిందని తెలుగుదేశం ఆరోపించింది. ఒక రాయి మూడు చోట్ల ఎలా గాయపరుస్తుందని ఆ పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం జరిగిన ఘటనలో సీఎం జగన్‌ అద్భుతంగా నటించారన్నారు.

"ఒక రాయి మూడు చోట్ల గాయం చేసింది. జగన్‌, వెల్లంపల్లికి ఒకేచోట గాయాలయ్యాయి. అదే రాయి మళ్లీ జగన్‌ కాలుకు కూడా గాయం చేసింది. శనివారం జరిగిన ఘటనలో  సీఎం జగన్‌ అద్భుతంగా నటించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో మంచి శిక్షణ ఇప్పించారు. గత ఎన్నికల ప్రచారం సమయంలో కోడికత్తి ఘటనను ప్రజలు నమ్మలేదు కనుకే వివేకాను హత్య చేయించారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా రాయి ఘటన విఫలమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబంలో కొందరికి ప్రాణహాని ఉంది. జాగ్రత్తగా ఉండాలి." - ఆనం వెంకట రమణారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details