రైతుల ఆస్తులు దోచుకునేందుకు జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ : టీడీపీ నేత ఆనం - Aanam Ramnarayana Reddy - AANAM RAMNARAYANA REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:06 PM IST
TDP Leader Aanam Ramnarayana Reddy Comment Land Titling Act : రైతుల ఆస్తులు దోచుకునేందుకు సీఎం జగన్ ల్యాండ్ టైట్లింగ్ పేరిట కొత్త జీవోను తెచ్చారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. ఇక భూ హక్కుకు సంబంధించి అసలైన పత్రాలు జగన్ కార్యాలయంలో ఉంటాయని, జిరాక్స్లు మాత్రమే మన చేతిలో ఉంటాయని ఆయన తెలిపారు. ఆత్మకూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లి, మురగళ్ళ, కనుపూరుపల్లి, బండారుపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ప్రచారంలో స్థానిక నాయకులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
సీఎం జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల భూములకు సంబంధించిన స్టాంపు పేపర్లు ఉండవని, కేవలం జిరాక్స్లు మాత్రమే ఉంటాయని ఆనం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూమికి సంబంధించిన పాసు పుస్తకం అంటే రాజముద్ర లాంటిదని, అది రైతుల హక్కు పత్రమని తెలియజేశారు. అలాంటి హక్కు పత్రంపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీఎం జగన్ తన ఫొటో వేయించుకున్నారని ఈ సందర్భంగా ఆనం మండిపడ్డారు.