ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోట్ల విలువైన థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద దోపిడిపై టీడీపీ నేతల ఆగ్రహం - ఎన్టీఆర్ జిల్లాలో బూడిద అక్రమ రవాణా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 4:04 PM IST

TDP, Janasena Protest for Thermal plant Ash Illegal Transport in Ntr District : ఎన్టీఆర్ జిల్లా  కొండపల్లి మున్సిపాలిటీలో బూడిద అక్రమ రవాణా నిలిపివేయాలంటూ విజయవాడ వీటీపీఎస్‌ కార్యలయం వద్ద టీడీపీ- జనసేన నేతలు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టాయి. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జ్‌ అక్కల రామ్మోహన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. థర్మల్ కేంద్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు భాగస్వాములై బూడిదను దోచుకుంటున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ధర్మల్ స్టేషన్ లోపల చేయాల్సిన పనులు చేయకుండా బూడిదను డ్రైనేజీలోకి రప్పించి జేసీబీలు, ప్రోక్లైన్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. 

బూడిదను వేలాది లారీలతో అడ్డగోలుగా దోచేస్తున్నారని విమర్శించరు. పెద్దిరెడ్డి దగ్గర పనిచేసే గుమస్తాలు, వైఎస్సార్సీపీ నాయకులకు ఎమ్మెల్యేలు మంత్రులకు బూడిద పంచి పెడుతున్నాడని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. బూడిద తిని మా ఆర్యోగ్యాలను తాకట్టు పెట్టారని దేవినేని మండిపడ్డారు. అడ్డగోలుగా బూడిద దోపిడి చేస్తున్నారని, ఈ అన్యాయంలో భాగస్వామ్యులైన ప్రతీ ఒక్కరిరి తగిన శిక్ష పడేవరకు మేము పోరాడతామని వారు పేర్కొన్నారు.
 

ABOUT THE AUTHOR

...view details