LIVE: చింతలపూడిలో చంద్రబాబు "రా-కదలిరా" సభ- ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 3:51 PM IST
|Updated : Feb 5, 2024, 5:04 PM IST
TDP Chandrababu Ra Kadali Ra chintalapudi Public Meeting Live: రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "రా-కదలిరా" సభను సోమవారం ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సభా స్థలికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికతోపాటు ముఖ్య అతిథులు, మీడియా ప్రతినిధులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మద్దతుదారులకు సంబంధించిన గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చింతలపూడి "రా-కదలిరా" సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.