LIVE: తిరుమల బ్రహ్మోత్సవాలు - హంసవాహనంపై శ్రీనివాసుడు - ప్రత్యక్ష ప్రసారం - Hamsa Vahana Seva LIVE - HAMSA VAHANA SEVA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2024, 7:00 PM IST
|Updated : Oct 5, 2024, 9:25 PM IST
LIVE : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో ఆయన భక్తులకు అభయ ప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ కొనసాగింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇప్పుడు స్వామివారు హంస వాహనంపై విహరిస్తున్నారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మాఢవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ప్రస్తుతం హంస వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Oct 5, 2024, 9:25 PM IST