ETV Bharat / entertainment

'OG స్టోరీ బాబాయ్ కంటే ముందు నేనే విన్నా - ఇది మీ ఊహకు అందదు' - Varun Tej on OG Movie - VARUN TEJ ON OG MOVIE

Varun Tej on OG Movie : మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ సినిమా 'మట్కా' టీజర్‌ లాంచ్‌ వేడుకలో బాబాయ్‌ మూవీ గురించి మాట్లాడారు.

Varun Tej on OG Movie
Varun Tej on OG Movie (Source: ETV Bharat (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 7:38 PM IST

Varun Tej on OG Movie : పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో 'ఓజీ'ఒకటి. ఈ సినిమాను డైరెక్టర్ సుజీత్ ముంబయి బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిస్తున్నారు. గతేడాది ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్​కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ కోసం పవర్​స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తన కామెంట్స్​తో హైప్ పెంచారు. ఈ కథను పవన్​ కంటే ముందు తానే విన్నట్లు చెప్పారు.

ఓజీపై వరుణ్‌ తేజ్‌
వ‌రుణ్ తేజ్ కొత్త మూవీ మ‌ట్కా టీజర్‌ రిలీజ్‌ వేడుక విజయవాడలో జరిగింది. ఈ వేడుక‌లో వ‌రుణ్ తేజ్, ఓజీ చిత్రం గురించి మాట్లాడారు. 'బాబాయ్ న‌టిస్తున్న ఓజీ చిత్రం గురించి ఒక‌ విష‌యం చెప్పాలి అనుకుంటున్నా. ఈ సినిమా క‌థ‌ బాబాయ్ కంటే ముందు నేనే విన్నాను. స్టోరీ అదిరిపోయింది. అస్సలు మీ ఊహకు అందదు. మీ వెయిటింగ్​కు ఇది వర్త్.​ బాబాయ్ కాస్త బిజీగా ఉన్నారు. కొంచెం అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయండి' అని పేర్కొన్నారు.

గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా 'ఓజీ' తెరకెక్కుతోంది. దీనికి తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. దీంతోపాటుగా పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమాలు ఉన్నాయి.

'మట్కా' సంగతులు
'ప‌లాస 1978' సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ 'మట్కా' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్​గా నటిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది.

ఈ టీజర్‌ రిలీజ్‌ వేడుకలో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ సినిమా మాస్‌ జాతరలా ఉంటుందని చెప్పారు. 'సినిమా ప్ర‌మోష‌న్స్ ద‌స‌రా న‌వ‌రాత్రి సమయంలో విజ‌యవాడ అమ్మ‌వారి దీవెనలతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ ఆలోచన మా దర్శకుడు, నిర్మాతకు వచ్చింది. మీ అంద‌రి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ త‌ర్వాత అలాంటి సినిమాలు చేయ‌ట్లేదు ఎందుకని చాలా మంది నన్ను అడిగారు. నా నుంచి అలాంటి సినిమా ఆశిస్తున్న వారి కోసమే ఈ మ‌ట్కా. ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో మాస్ జాత‌ర‌లా ఉంటుంది' అని అన్నారు.

సుధీర్ 'మా నాన్న సూపర్‌ హీరో', వరుణ్ 'మట్కా' క్రేజీ గ్లింప్సెస్​- మీరు చూశారా? - Maa Nanna Super Hero

'తండేల్'​ టు 'తంగలాన్' ​- టైటిల్స్​లో కొత్త ట్రెండ్​ - వీటికి అర్థాలు తెలుసా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.