thumbnail

LIVE: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - పెద్ద శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు - TIRUMALA BRAHMOTSAVAM 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 5 minutes ago

Tirumala Pedda Sesha Vahanam Live: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. గురువారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేడు మీనా లగ్నంలో ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వాహనసేవాలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రధానం చేయనున్నారు. 12వ తేదీన చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించి శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. శ్రీనివాసుడు పెద్ద శేష వాహనంపై ఉరేగుతున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో పెద్ద శేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : 5 minutes ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.