IRCTC Amazing Andaman Ex Hyderabad Tour: అండమాన్ నికోబార్ దీవులు.. దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లను చూడాలని.. అక్కడికి వెళ్లాలని చాలా మంది ఆశ పడుతుంటారు. అందులోనూ ఈ అందాలను చూడటానికి ఫ్లైట్ జర్నీ అంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. మరి మీరు కూడా ఆ అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ (Amazing Andaman Ex Hyderabad) పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్ లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 06.35 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 09.15 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయ్యాక సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కోర్బికోవ్ బీచ్‌కు వెళతారు. ఆ తర్వాత సెల్యూలార్ జైల్ వద్ద లైట్ అండ్ సౌండ్ షో విజిట్ చేస్తారు. ఆ రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లోనే భోజనం, బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రోస్ ఐలాండ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత నార్త్ బే ఐలాండ్ వెళ్తారు. అక్కడ పలు యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. తిరిగి పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని లంచ్ పూర్తి చేసిన తర్వాత టైమ్ ఉంటే సాముద్రిక మెరైన్ మ్యూజియం విజిట్ చేస్తారు. సాయంత్రం ఫ్రీ టైమ్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి కూడా పోర్ట్ బ్లెయిర్‌లో బస చేయాలి.
మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి హావ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత.. రాధానగర్ బీచ్ చూస్తారు. ఆ రాత్రి హావ్‌లాక్‌లోనే బస ఉంటుంది.
సింగపూర్ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు!
నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నెయిల్ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత లక్ష్మణపూర్ అండ్ సీతాపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రి నీల్ ఐలాండ్‌లోనే డిన్నర్, బస ఉంటుంది.
ఐదో రోజు రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత భరత్ నగర్ బీచ్ సందర్శన ఉంటుంది. అనంతరం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంతరం పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉదయం 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధర వివరాలు చూస్తే:
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 71,810, డబుల్ ఆక్యూపెన్సీకి రూ. 55,200, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.53,560 చెల్లించాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.46,600 చెల్లించాలి.
- 2 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ అయితే రూ. 43,200 పే చేయాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ఫ్లైట్ టికెట్లు(హైదరబాద్ - పోర్ట్ బ్లెయిర్ / పోర్ట్ బ్లెయిర్ - హైదరాబాద్)
- హోటల్ అకామిడేషన్
- ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్
- 4 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు ఉంటాయి.
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్ 18, నవంబర్ 22వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..
ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! ధర చాలా తక్కువ!
అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్‌సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!