తిరుపతికి తుళ్లూరు రైతుల బస్సుయాత్ర - జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ - Thullur Farmers Tirupati Bus Yatra - THULLUR FARMERS TIRUPATI BUS YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 1:43 PM IST
Thullur Farmers Tirupati Bus Yatra : అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన రైతులు, మహిళలు తమ మొక్కులు చెల్లించేందుకు తిరుపతికి బస్సుయాత్ర చేపట్టారు. ఈ యాత్రను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుళ్లూరు శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో అన్నదాతలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
రాజధాని వేగంగా అభివృద్ధి చెందేలా తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రైతులు తెలిపారు. అమరావతి అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమంత్రి చంద్రబాబు అని భావించారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. అందుకే వీరు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నారని చెప్పారు. రాజధాని పరిరక్షణే ధ్యేయంగా చాలా మంది మొక్కులు మొక్కారని వివరించారు. ఈరోజు అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారని, అందులో రాజధానికి సంబంధించిన పరిస్థితులను వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మందడానికి చెందిన రైతు పాతూరి రాంబాబు శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు. మందిరం శివాలయం నుంచి చేపట్టిన ఈ యాత్రను ఎమ్మెల్యేను ప్రారంభించారు.