తెలంగాణ

telangana

ETV Bharat / videos

ల్యాండ్ అవుతూ కూలిన హెలికాప్టర్- ఎన్నికల ప్రచారంలో సుష్మకు తప్పిన పెను ప్రమాదం - HELICOPTER CRASH - HELICOPTER CRASH

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 2:37 PM IST

Sushma Andhare Helicopter Accident : మహారాష్ట్రలోని రాయ్​గఢ్ జిల్లాలో శివసేన UBT నాయకురాలు సుష్మ అంధారేకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ఎక్కబోయే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

అసలేం జరిగిందంటే?
సుష్మ అంధారే గురువారం మహాద్​లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం బారామతిలో జరగనున్న మరో ర్యాలీకి ఆమె వెళ్లాల్సి ఉంది. తీవ్రమైన ఎండల కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లలేక హెలికాప్టర్​లో ప్రయాణించాలని అనుకున్నారు. అందుకు గాను హెలికాప్టర్​ను రప్పించారు. మహాద్ మైదానంలో హెలికాప్టర్ ఎక్కేందుకు సుష్మ సిద్ధంగా ఉన్నారు. చాలా సేపు ఎదురుచూసినా హెలికాప్టర్ రాలేదు. 

ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాప్టర్​ను ల్యాండ్ చేసేందుకు రెండు రౌండ్లు వేశారు పైలట్. కానీ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతారని సుష్మ అంధారే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details