మేము సైతం ప్లాస్టిక్ భూతం నిర్మూలనలో - వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు - Students On Plastic Bags Awareness - STUDENTS ON PLASTIC BAGS AWARENESS
Published : Jul 3, 2024, 10:08 PM IST
Students Creating Awareness On Plastic Bags : పుడమితల్లిని ప్లాస్టిక్ భూతం పీడిస్తోంది. పాలిథిన్ కవర్ల వాడకంపై నిషేధం ఉన్నా తయారీదారులు ఇస్తున్నారని విక్రయదారులు విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లను వినియోగిస్తూనే ఉన్నారు. ఫలితంగా కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తుండగా మరో 12 శాతం వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. మిగిలిన 79 శాతం వ్యర్థాలు భూమిలో, సముద్రంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఏటా ఒక్కో వ్యక్తి ఈ భూమి మీద సుమారు 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమవుతున్నాడు. మరి, ప్లాస్టిక్‌కు కట్టడి చేయడానికి భవిష్యత్ తరతరాల సారథులుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా సమాజానికి ఏం చెప్పాలను కుంటున్నారో ఆ విద్యార్థుల మాటల్లోనే విందాం.