ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాకు ఉచితాలు వద్దు- మాకు కావాల్సింది భవిష్యత్తు - ధర్నాచౌక్ వద్ద విద్యార్థుల ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:31 PM IST

Students Protest In Vijayawada Against Jagan Govt : పెండింగ్‌లో ఉన్న ఫీజ్ రియంబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నాచౌక్ వద్ద  విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు తమ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో మైనారిటీ కాలేజీని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వంతో తాము భవిష్యత్ ను కోల్పోతున్నామని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించపోతే ధర్నా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మాకు ఉచితాలు వద్దు- భవిష్యత్తు కావాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భందగా వారు తమ సర్టిఫికెట్లు తమకు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్​ అధికారంలోకి రాకముంది అన్ని మాయమాటలు చెప్పారని, ఇప్పుడు విద్యార్థుల జీవితాల్లో చీకటి నింపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details