తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : తిరుమల బ్రహ్మోత్సవాలు - గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీనివాసుడు - GAJA VAHANA SEVA AT TIRUMALA

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 7:08 PM IST

Updated : Oct 9, 2024, 10:01 PM IST

Srivari Gaja Vahana Seva Live : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వరద హస్తం దాల్చిన వేంకటాద్రి హనుమంత వాహనంపై ఊరేగారు. రామావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధులలో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజకంగా సాగింది. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. భక్తి పారవశ్యంతో స్వామిని దర్శించుకొని పులకించారు. ఆలయంలో సాయంత్రం స్వర్థ రథోత్సవం నిర్వహించారు. శ్రీవారి గజ వాహన సేవ - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Oct 9, 2024, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details