ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్ - నిలిచిన ఆన్‌లైన్ టికెట్ల జారీ - Srisailam Temple website stopped - SRISAILAM TEMPLE WEBSITE STOPPED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 10:41 PM IST

Srisailam Devasthanam Website Stopped: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానంలో ఆన్​లైన్ వెబ్​సైట్ సేవలు నిలిచిపోయాయి. దేవస్థానం వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య తలెత్తడంతో, నిన్న సాయంత్రం నుంచి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్ల బుకింగ్ నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా దర్శనానికి మాత్రమే మాన్యువల్ టికెట్లను దేవస్థానం అధికారులు జారీ చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో, ఆర్జిత సేవలు, అభిషేకం, కుంకుమార్చన సేవలను భక్తులు నిర్వహించలేకపోతున్నారు.

ఆన్​లైన్​లో వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, టికెట్లు రాకపోగా భక్తుల నగదు రిఫండ్ కాలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భక్తుల నగదు రిఫండ్ విషయంలో దేవస్థానం అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సకాలంలో ఆన్​లైన్ వెబ్​సైట్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్​లైన్ టికెట్లు బుకింగ్ నిలిచిపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలంతో పాటు దేవాదాయ శాఖలో ఇతర దేవాలయాల ఆన్​లైన్ వెబ్​సైట్ సర్వర్ డౌన్, సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయినట్లు దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details