ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అట్టహాసంగా ఎర్రితాత స్వామి రథోత్సవం - బసవేశ్వరుడి ఉరేగింపు - YERRITHATHA SWAMY RADHOTSAVAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 12:57 PM IST

Sri Yerrithatha Maha Radhotsavam in Vyrampuram : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై. రాంపురంలో వెలసిన ఎర్రితాత స్వామి రథోత్సవం  వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి బసవేశ్వరుని ఉత్సవమూర్తిగా కొలువు దీర్చి రథోత్సవంపై ఉరేగించారు. తెల్లవారుజాము నుంచే ఎర్రితాత మూల విరాట్​కు అభిషేకాలు, అర్చనలు చేశారు. పూలు, మామిడి తోరణాలతో బ్రహ్మరథాన్ని ప్రత్యేకంగా అలకరించారు. అలంకరణలో ఎర్రితాత జీవ సమాధి బసవ ఉత్సవాన్ని నిర్వహించారు. సమాధిని అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 

Police Security in Radhotsavam : అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎర్రితాత స్వామి రథోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో వై.రాంపురం గ్రామమంతా జనసంద్రంగా మారింది. దారి పొడవున భక్తులు రథాన్ని దర్శించుకోగా మరికొందరు ఉత్సాహంగా రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details