ETV Bharat / politics

హనీమూన్ ముగిసింది - ఇక మంత్రులు పట్టు సాధించాలి: చంద్రబాబు - CM INSTRUCTIONS TO MINISTERS

మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ - మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

cm_instructions_to_ministers
cm_instructions_to_ministers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 9:29 PM IST

CM Chandrababu Instructions to Ministers: మంత్రులకు హనీమూన్ పిరియడ్ ముగిసిందని ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని, శాఖలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు.

అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అధికారులు చెప్పే సమాచారాన్ని వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఉదహరించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చ సందర్భంగా పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇప్పటికే వివిధ పాఠశాలల్లో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని మంత్రి నారా లోకేశ్​ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేశ్​ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ సూచించారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటకాభివృద్ది జరగాలనే దానిపై చర్చించారు. ఎస్ఐపీబీ నిర్ణయం తీసుకున్న పరిశ్రమలు మొదలయ్యేలా చూడాలని పవన్ సూచించారు. రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

వైఎస్సార్సీపీ అస్తవ్యస్త నిర్ణయాలు - రాష్ట్ర అప్పుల భారం రూ.10.86 లక్షల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.