ETV Bharat / politics

అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు - AP CABINET DECISIONS

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం - కీలక అంశాలపై నిర్ణయం

ap_cabinet_decisions
ap_cabinet_decisions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 7:47 PM IST

Updated : Nov 20, 2024, 10:44 PM IST

AP Cabinet Meeting Chaired by CM Chandrababu: ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ క్రమంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు బిల్లుకు క్యాబినెట్​ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌ 2019 రిపీట్‌ చేయాలని క్యాబినెట్​లో ప్రతిపాదించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ సవరణ చేశారు.

అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు (ETV Bharat)

2024- 25 కొత్త క్రీడా పాలసీకి క్యాబినెట్​లో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌ (ఎలైట్ యాంటీ నార్కొటిక్ గ్రూప్‌)గా మారుస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్​లో తీర్మానం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ క్యాబినెట్​​లో ప్రతిపాదన చేశారు.

రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పీడీ యాక్ట్ పటిష్ఠం చేస్తూ సవరణ బిల్లుకు, లోకాయుక్త చట్టసవరణ బిల్లుకు క్యాబినెట్​ ఆమోదం తెలిపంది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై మంత్రి వర్గం చర్చించింది. పార్లమెంట్‌లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఆలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించే చట్టసవరణ బిల్లును క్యాబినెట్​ ఆమోదించింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు క్యాబినెట్​ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను క్యాబినెట్​ ఆమోదించింది. టెండర్లు పిలిచి అమరావతి పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు చేసింది.

"ఏమిటీ అప్పులు, ఎందుకీ ఖర్చులు?" - మండలిలో వాడీవేడి చర్చ

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది : పవన్ కల్యాణ్

Last Updated : Nov 20, 2024, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.