ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సర్వైకల్ స్పాండిలైటిస్​పై పరిశోధన - గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు - సర్వైకల్ స్పాండిలైటిస్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 2:02 PM IST

Doctor Naresh Babu Selected for International Award: గుంటూరుకు చెందిన ప్రముఖ వెన్నెముక వైద్య నిపుణుడు డాక్టర్ నరేష్ బాబు (Spine Specialist Doctor Naresh Babu) అంతర్జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వెన్నెముక సమస్యల కారణంగా వచ్చే సర్వైకల్ స్పాండిలైటిస్‌ (Cervical spondylitis) పై ఆయన పరిశోధన చేసినందుకు గాను అమెరికా(America)కు చెందిన స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ (Scoliosis Research Society) నుంచి వైట్ క్లౌడ్ అవార్డు (White Cloud Award) అందుకోనున్నారు.

Spine Specialist Doctor Naresh Babu: కొత్తగా అందుబాటులోకి వచ్చిన డైనమిక్ ఎమ్​ఆర్​ఐ (Dynamic MRI) ద్వారా రోగి (Patient)ని కూర్చోబెట్టి స్కానింగ్ (Scanning) నిర్వహించారు. అదే విధంగా ఏపీ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ (AP Society of Orthopedic Surgeons) తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ నరేష్‌కు బంగారు పతకం (Gold medal) ప్రకటించింది. మల్లికా ఆసుపత్రి (Mallika Hospital)లో జరిగిన పరిశోధనలకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినందుకు డాక్టర్ నరేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details