వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని క్యూఆర్టీ సభ్యులు ఎలా కాాపాడారో చూడండి - Tekmal Gunduwagu of Medak district - TEKMAL GUNDUWAGU OF MEDAK DISTRICT
Published : Sep 3, 2024, 5:36 PM IST
|Updated : Sep 3, 2024, 7:50 PM IST
Tekmal Gunduwagu of Medak district: మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు పొంగిపొర్లుతుండగా వాగును దాటడానికి ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయి, వాగులో ఓ బండరాయిని పట్టుకొని మధ్యలో ఆగిపోయాడు. వాగు మధ్యలో కొట్టుకుపోతున్న వ్యక్తిని మెదక్ క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీం) సభ్యులు గమనించారు. దాంతో ఇద్దరు సభ్యులు, ఓ పోలీసు కానిస్టేబుల్ తాడు సహాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకొని ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడ్డారు. ఆ వ్యక్తిని గుండు వాగు వరద ప్రవాహం నుంచి బయటకు తీసుకొచ్చారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొంగిపొర్లుతున్న గుండు వాగులో చిక్కుకున్న 45 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సభ్యులను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అభినందించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి. గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని భద్రతా సిబ్బంది పదేపదే చెబుతున్నారు. అయినా కొంతమంది పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.