ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏలూరులో దారుణం - పింఛను సొమ్ము కోసం కన్న తల్లినే కడతేర్చిన కుమారుడు - Son Murder Mother For Pension Money - SON MURDER MOTHER FOR PENSION MONEY

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 12:30 PM IST

Updated : May 2, 2024, 1:04 PM IST

Son Murder Mother For Pension Money in Eluru District : పింఛను సొమ్ము కోసం కన్న తల్లినే ఓ కొడుకు కడతేర్చాడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పడమర వీధికి చెందిన డొక్కు కృష్ణవేణి సామాజిక పింఛను పొందుతుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు హరికృష్ణ మద్యానికి బానిసై ప్రతీ రోజూ గొడవ పడేవాడు. అలాగే తల్లిని తరచూ కొడుతుంటాడు. ఈ నేపథ్యంలో పింఛను డబ్బులు ఇవ్వాలని తల్లి కృష్ణవేణిని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది.  పింఛను డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెతో ఘర్షణకు దిగాడు. అనంతరం దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణవేణి తీవ్రంగా గాయపడింది. ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించే క్రమంలో దారి మధ్యలో మరణించింది. ఈ సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Last Updated : May 2, 2024, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details