ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బాపట్లలో పోలీసు జులుం - వృద్ధుడిపై చేయి చేసుకున్న ఎస్సై శివనాగిరెడ్డి - SI ATTACK OLD MAN - SI ATTACK OLD MAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 5:12 PM IST

SI Shivanagi Reddy Attack on Old Man in Bapatla District : బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామంలో ఓ వృద్ధుడిపై స్థానిక ఎస్సై శివనాగిరెడ్డి జులుం ప్రదర్శించారు. శానంపూడి హనుమంతరావు అనే 65 ఏళ్ల వృద్ధుడు తన బడ్డీ కొట్టులో మద్యం అమ్ముతున్నాడంటూ ఆరోపిస్తూ ఎస్సై అతనిపై చేయి చేసుకున్నాడు. వృద్ధుడు అని కూడా చూడకుండా అతడిని కొట్టారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

హనుమంతరావు బల్లికురవ మండలం నాగరాజుపల్లి గ్రామంలో నివాసం ఉంటూ చిన్న బడ్డీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే అతను తెలుగుదేశం సానుభూతిపరుడనే కారణంతోనే మద్యం అమ్ముతున్నాడంటూ ఎస్సై కొట్టాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కొన్ని మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. దుకాణంలో తనిఖీలు నిర్వహించే సమయంలో ఒక్క మద్యం సీసాని గుర్తించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇదే ఎస్సై శివనాగిరెడ్డి ప్రజాగళం సభకు వెళ్తున్న వేమవరం ఎస్టీ తండాకు చెందిన తెలుగుదేశం నాయకులపైనా కేసు నమోదు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details