తెలంగాణ

telangana

ETV Bharat / videos

మూలా నక్షత్రం వేళ సరస్వతి అలంకరణలో అమ్మవారు - NAVARATHRI CELEBRATIONS TELANGANA

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 12:51 PM IST

Navarathri Celebrations in Telanagana: రాష్ట్రవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా మెదక్‌ జిల్లా ఏడుపాయలలో 7వ రోజు వనదుర్గమ్మ మాత సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. అదే విధంగా వరంగల్‌ వాసుల ఇలవేల్పు భద్రకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హంస వాహనంపై చేతిలో వీణ పట్టుకున్న సరస్వతి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. 

అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వీఐపీల కోసం ప్రత్యేక గేటు కేటాయించకపోవడంతో సర్వదర్శనాన్ని నిలిపివేసి వారికి దర్శనం కల్పించే పరిస్థితి నెలకొంది. దీంతో ఆలయ అధికారుల తీరుపై సాధారణ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా బాసరలో ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు మూలా నక్షత్రంలో భాగంగా అమ్మవారు కాళకాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారుల అక్షరాభ్యాసానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details