ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొండముచ్చుల దాడులతో బెంబేలెత్తుతున్న జనం- పట్టించుకోని అధికారులపై ఆగ్రహం - Monkey Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 4:18 PM IST

Seven Children Injured in Monkey Attack: పాఠశాలకు సెలవు దినం కావడంతో పిల్లలంతా సరదాగా ఆటలు ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా కొండముచ్చుకోతి పిల్లలపై అమాంతంగా దాడి చేసింది. తమ మీదకు వచ్చిన కొండముచ్చు వల్ల పిల్లలు భయపడి పరుగులు తీశారు. అయినా పిల్లలను వదలకుండా ఆ కోతి దాడి చేసింది. ఈ ఘటనలో సమారు 8 మంది పిల్లలకు గాయలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన పిల్లలను స్థానికులు సమీప హాస్పటల్​కి తరలించారు. ఈ ఘటన నంధ్యాల జిల్లాలో జరిగింది. 

నంద్యాల జిల్లా డోన్‌లో కొండముచ్చు హల్‌చల్‌ చేసింది. పట్టణంలోని పాతపేట వీధిలో క్రికెట్‌ ఆడుతున్న పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కొండముచ్చు దాడిలో 8 మంది పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. పిల్లల కాళ్లు, చేతులు, పిక్కలపై కొరికి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన చిన్నారులని ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా డోన్‌లో కొండముచ్చు దాడులు పెరిగిపోయాయని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టణంలోని అయ్యప్పస్వామి గుడి, పాతబస్టాండ్‌, కొత్తపేటలలో కొండముచ్చు దాడిలో 20 మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details