ETV Bharat / state

ఫ్లైయాష్ వివాదం - ముగ్గురు అధికారులపై బదిలీ వేటు

బూడిద తరలింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులపై ఏపీ జెన్ కో బదిలీ వేటు

RAYALASEEMA THERMAL POWER PLANT IN YSR DISTRICT
RTPP STAFF TRANSFERED BY AP GEN CO (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 20 hours ago

RTPP Staff Transfer in YSR District : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ఫ్లయాష్ వివాదం నేపథ్యంలో ముగ్గురు అధికారులపై ఏపీ జెన్ కో అధికారులు బదిలీ వేటు వేశారు. బూడిద తరలింపు వ్యవహారం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బూడిద తరలింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను ఏపీ జెన్ కో అధికారులు బదిలీ చేశారు.

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం

వివరాల్లోకి వెళ్తే : ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ ఏడీ చంద్ర ఓబుల్ రెడ్డి, ఫ్లైయాష్ ఏడీ నందా నాయక్, మరో ఏడీ శ్రీనివాసులను బదిలీ చేస్తూ ఏపీ జెన్ కో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరి ముగ్గురిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు. బూడిద తరలింపులో సైతం ఆర్టీపీపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు కావాల్సిన సిమెంటు కర్మాగారాలను స్థానికులకు కాంట్రాక్టు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీపీపీ నుంచి లారీల్లో బూడిద ఓవర్ టన్నేజ్ తరలిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగానే ఇద్దరి కూటమి నేతల మధ్య వివాదం రేగుతున్నా పట్టించుకోలేదని జెన్ కో అధికారులు తీవ్రంగా పరిగణించారు.

అసలేం జరిగిందంటే: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీ ర్‌రెడ్డి, పెద్దారెడ్డి సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తరువాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవడం ప్రారంభించారు. అయితే దీనికి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం కాస్తా ముదిరింది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించగా ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం జ్వరంగా ఉందని చెప్పి గైర్హాజరయ్యారు.

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.