భార్య, కుమార్తెను వదిలేసిన వర్మను తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ వెనకేసుకొస్తున్నాడు - TDP BUDDHA VENKANNA ON RGV
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 4:10 PM IST
TDP Buddha Venkanna on RGV: భార్య, కుమార్తెను వదిలేసిన వర్మను తల్లి, చెల్లిని బయటకు గెంటిన జగన్ వెనకేసుకొస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు వాగిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు భయపడి పారిపోయాడని దుయ్యబట్టారు. వర్మకు సిగ్గుంటే ఆనాడు రెచ్చిపోయి, ఇప్పుడు దాక్కున్న వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని సవాల్ విసిరారు.
కల్లు తాగిన కోతిలా వర్మ వాగుతుంటే, జగన్ వంత పాడుతున్నాడని బుద్ధా ఆక్షేపించారు. కించచపరిచే పోస్టుల పెట్టిన రాంగోపాల్ వర్మను జగన్ వెనకేసుకొని రావటం ఏంటని ధ్వజమెత్తారు. జగన్ అసలు బాగోతం తెలిసి వైఎస్సార్సీపీని చాలామంది వీడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయమని, కూటమి పార్టీల వైపు కీలక నేతలు చూస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువు, ప్రతిష్టలను అమెరికాలో కూడా తీసేసిన చరిత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అని దుయ్యబట్టారు.